Kotha Lokah | ఇటీవల థియేటర్లలో విడుదలైన మలయాళ చిత్రం ‘కొత్త లోక’ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కొంత ఆలస్యంగా, పలు సమస్యల మధ్య విడుదలైనప్పటికీ, అద్భుతమైన స్పందన పొందింది. ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించగా ‘ప్రేమలు’ ఫేమ్ నటుడు నస్లెన్ కీలక పాత్రలో మెప్పించారు.
వీకెండ్ రావడంతో ‘కొత్త లోక’ తెలుగులో మంచి ఓపెనింగ్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొదటి రోజు, (శనివారం) తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చిత్రం ఒక కోటి రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. పెద్దగా ప్రచారం, బజ్ లేకుండానే ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఈ సినిమాకు డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా, తెలుగులో నాగవంశీ సమర్పణలో విడుదలైంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సూపర్ హీరో చిత్రానికి మంచి మార్కులు వేయడంతో, రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Book your tickets for #KothaLokah right away! 😎
A thrilling fantasy superhero world awaits… action, adventure, and pure big-screen magic! 🤩❤️🔥
SUPERHERO SENSATION ~ In Cinemas Now. 🔥@DQsWayfarerFilm @dominicarun @NimishRavi @kalyanipriyan @naslen__ @jakes_bejoy… pic.twitter.com/XaRNSQYa5M
— Vamsi Kaka (@vamsikaka) August 31, 2025