OTT | ఓటీటీలోకి రానున్న ‘పేట్రియట్’.. మమ్ముట్టి – మోహన్‌లాల్ మల్టీస్టారర్‌కు విడుదల తేదీ ఖరారు
OTT | మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు దిగ్గజ నటులు మమ్ముట్టి, మోహన్‌లాల్ చాలా కాలం తర్వాత కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘పేట్రియాట్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు మహేష్ నారాయణన్ తెరకెక్కించిన ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్‌తో పాటు రాజకీయ నేపథ్యాన్ని కూడా కలిగి ఉండటంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది.
OTT | మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు దిగ్గజ నటులు మమ్ముట్టి, మోహన్‌లాల్ చాలా కాలం తర్వాత కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘పేట్రియాట్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు మహేష్ నారాయణన్ తెరకెక్కించిన ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్‌తో పాటు రాజకీయ నేపథ్యాన్ని కూడా కలిగి ఉండటంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. గత మే 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం యాక్షన్, భావోద్వేగాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికపైకి రానుంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకోగా, జూన్ 5 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రం ప్రసారం కానుంది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన సినీ అభిమానులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశ భద్రత, నిఘా వ్యవస్థలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో మమ్ముట్టి డీఆర్డీవో అధికారిగా కనిపించగా, ఆయనపై వచ్చిన దేశద్రోహ ఆరోపణల వెనుక నిజాలను బయటపెట్టే కీలక పాత్రలో మోహన్‌లాల్ నటించారు. వీరిద్దరి నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అలాగే ఈ చిత్రంలో నయనతార న్యాయవాది పాత్రలో నటించగా, ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. కుంచాకో బోబన్, రేవతి వంటి ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటించారు. భారీ తారాగణం, బలమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

