Malavika Mohanan | సినీ సెలబ్రిటీలు కూడా కొన్ని సార్లు విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారానో లేదంటే పలు ఇంటర్వ్యూలలోనో తమకి ఎదురైన చేదు అనుభవాల గురించి వివరిస్తూ ఉంటారు. నటి మాళవిక మోహనన్కి కూడా విచిత్ర పరిస్థితి ఎదురైందట. మాళవిక మోహన్ హిందీ, కన్నడతో సహా పలు భాషల్లో నటించారు. ముంబైలో పుట్టి పెరిగిన మాళవిక మోహన్, దక్షిణ భారతంలోనే ఎక్కువ అవకాశాలు పొందారు. ఇటీవల ఈ అమ్మడు హాట్ కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉన్నారు. ఓ ఇంటర్వ్యూలో దక్షిణ భారత సినిమా దర్శక నిర్మాతల ఆసక్తి గురించి మాట్లాడుతూ వారు నాభిపై ఎక్కువ ఫోకస్ పెడతారని, నాభిని జూమ్ చేసి చూపిస్తారని, క్లోజప్ షాట్లు తీస్తారని అది చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంది.
అలానే తనతో, తన స్నేహితులతో ఇబ్బందికరంగా ప్రవర్తించడం గురించి ఓపెన్ అయింది. ముంబయిలో ఓ రోజు రాత్రి నా స్నేహితులతో కలిసి లోకల్ ట్రైన్లో జర్నీ చేస్తుండగా, ఆ సమయంలో మేము కాకుండా ఆ కంపార్ట్మెంట్లో ఎవరు లేరు ..ఆ టైంలో ఓ వ్యక్తి అందులోకి వచ్చేందుకు యత్నించాడు. కంపార్ట్మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి తొంగిచూస్తూ ముద్దిస్తావా అంటూ సైగలు చేయడంతో నేను, నా ఫ్రెండ్స్ భయపడ్డాం. మాకు ఏం చేయాలో అర్థం కాక వణికిపోయాం. దాదాపు 10 నిమిషాల తర్వాత వేరే స్టేషన్ రాగానే అక్కడ కొంతమంది ప్రయాణికులు మా కంపార్ట్మెంట్లో ఎక్కారు. అప్పుడు మేము ఊపిరి పీల్చుకున్నాం అని మాళవిక చెప్పుకొచ్చింది.
21 ఏళ్లకే హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టిన తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. తన తొలి సినిమా రిలీజ్ అయ్యాక చాలా సన్నగా ఉన్నానని ఎంతో మంది ట్రోల్ చేశారట. ‘ఫస్ట్ సినిమా తర్వాత నా శరీరాకృతి ఎంతో మారింది. కొంచెం బొద్దుగా మారిన తర్వాత కూడా విమర్శించారు. దక్షిణాది చిత్రాల్లో కనిపించాలంటే అమ్మాయి కాస్త బొద్దుగా ఉండాలి. హీరోయిన్స్ బొడ్డు మీదే ఎక్కువగా ఫోకస్ పెడతారు అంటూ కామెంట్స్ చేసింది.. హీరోయిన్స్ కూడా బొడ్డు కనిపించేలా దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు అంటూ మాళవిక కామెంట్స్ చేసింది. మాళవిక ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.