మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్ గా పని చేసి మంచి పేరు సంపాదించిన మోహనన్ కుమార్తె మాళవిక. తండ్రి స్వయానా డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కావడంతో ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన ఆమె తరువాత చదువుకోకుండా తన తండ్రి తో పాటు సినిమాటోగ్రఫీ మీద ఆసక్తి పెంచుకుంది. నిత్యం తన సెక్సీయెస్ట్ పిక్స్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
అందాలు పూత పోసినట్టు ఉండే ఈ భామ హాట్ షోకి ఎవ్వరైనా మత్తికెక్కిపోవాల్సింది. ఆమె అందాల ప్రవాహంలో తడిసి ముద్దవాల్సిందే. మలయాళంలో రెండు సినిమాలు చేసిన తర్వాత కన్నడలో సినిమా ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత కన్నడ సినిమా పూర్తి చేసిన వెంటనే హిందీ సినిమా అవకాశం వచ్చింది. అయితే రజనీకాంత్ హీరోగా రూపొందిన పెటా సినిమాలో ఆమె కీలక పాత్రల్లో నటించి తమిళ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది.
2021లో విజయ్ మాస్టర్ అనే సినిమాలో కూడా మాళవిక నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం హీరో ధనుష్ పక్కన ‘మారన్’లో నటిస్తోంది. దీంతో పాటు రవి ఉడయార్ దర్శకత్వంలో సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటిస్తున్న ‘యుత్ర’ లో మాళవికా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలలో మాళవిక గాయపడింది. చేతికి, కాలికి దెబ్బలు తగలగా, వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. యాక్షన్ సినిమా షూటింగ్లో గాయాలు తగులుతుంటాయి అని పేర్కొంది. ఆమె ఫొటోలకు నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.