Malavika Mohanan| ఈ రోజుల్లో సెలబ్రిటీలు అభిమానులతో అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కొందరు నెటిజన్స్ వేసే తింగరి ప్రశ్నలకి కూడా చాలా ఓపికగా సమాధానం ఇస్తుంటారు. తాజాగా మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌కి ఓ నెటిజన్ వెరైటీ ప్రశ్న వేసాడు. దానికి ఈ తమిళ బ్యూటీ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మాళవిక మోహనన్ ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోంది . తంగలాన్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెంచుకోగా, ఆ మధ్యన ఓ హిందీ సినిమాలోనూ కనిపించి మెప్పించింది.
ఇక ఇప్పుడు ప్రభాస్ -మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న రాజా సాబ్ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ భామ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటూ తన అందాలతో అదరగొడుతుంది . అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా కూడా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఓ నెటిజన్ మాళవికను డైరెక్ట్ గా మీరు వర్జినా అని అడిగారు. దానికి చాలా కోపం తెచ్చుకున్న మాళవిక.. ఈ రకమైన చెత్త ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు. ఇలాంటివి అడగడం మానేయండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. మాళవిక కోపానికీ ఓ అర్థం ఉందని ఆమె అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు.
ఇక మాళవిక బ్యూటీ సీక్రెట్ ల గురించి, డైట్ ల గురించి కొందరు నెటిజన్స్ అడిగారు. మరికొందరు ఆమె పెళ్లి గురించి, క్రష్ గురించి ప్రశ్నలు వేశారు. వాటికి మాళవిక..నవ్వుతూ ఫన్నీగా రిప్లైలు ఇచ్చింది. కానీ ఓ నెటిజన్ అసలు మీరు వర్జినా.. మిమ్మల్ని పెళ్లి చేసుకొవాలని అనుకుంటున్నాను.. మీకు భర్త కావాలంటే ఎలాంటి క్వాలీటీస్ ఉండాలని తింగరి ప్రశ్నలు వేసే సరికి కోపం కట్టలు తెంచుకుంది. రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు వేయడం మానాలని, ఈ వంకరబుద్దిని మార్చుకొవాలంటూ పలు చురకలు కూడా పెట్టంది మాళవిక. అయితే ఆమె సీరియస్ కావడంతో నెటిజన్ తన ట్వీట్‌ని డిలీట్ చేశారు. ఇక తన ఫోకస్ అంతా సినిమాల మీద ఉందని, ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా లేదని మాళవిక చెప్పుకొచ్చారు.