Malala Yousafzai: ఆస్కార్స్‌లో మలాలా సిల్వర్ మెరుపులు..
Malala Yousafzai:ఆస్కార్స్ ఈవెంట్లో మలాలా యూసఫ్జాయి .. సిల్వర్ కలర్ హుడీ గౌన్‌లో హాజరైంది. ఆమె ప్రొడ్యూస్ చేసిన షార్ట్ ఫిల్మ్.. బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో పోటీపడింది. ఇక తాను కేవలం పీస్ గురించి మాత్రమే మాట్లాడుతానని హోస్ట్ జమ్మీ అడిగిన ప్రశ్నకు బదులిచ్చింది.
లాస్ ఏంజిల్స్: సామాజిక కార్యకర్త మలాలా యూసఫజాయి(Malala Yousafzai).. ఆస్కార్స్(Oscars) వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. చిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి గెలిచిన ఆ పాకిస్థానీ యాక్టివిస్ట్ ఈ యేటి ఆస్కార్స్‌లో తన భర్త అసర్ మాలిక్‌తో కలిసి హాజరైంది. ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తీసిన షార్ట్ ఫిల్మ్ స్ట్రేంజర్ ఎట్ ద గేట్(stranger at the gate).. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. అయితే అవార్డు ఫంక్షన్‌కు వచ్చిన మలాలా.. సిల్వర్ కలర్ హుడ్ గౌన్(silver color hooded gown)లో కలర్ఫుల్గా మెరిసింది. రాల్ఫ్ లారెన్ బ్రాండ్‌కు చెందిన ఆ డ్రెస్సులో నోబెల్ గ్రహీత(Nobel award winner) హాలీవుడ్ హీరోయిన్లా వెలిగిపోయింది.
Treat people with kindness✌️ https://t.co/ZvUVHcrTBJ
— Malala Yousafzai (@Malala) March 13, 2023
నిజానికి ఎప్పుడూ సల్వార్ కమీజ్‌లో కనిపించే మలాలా.. అకాడమీ అవార్డులకు మాత్రం ఆ స్టయిల్లోనే ఎంట్రీ ఇవ్వడం అందర్నీ స్టన్ చేసింది. హుడీ సిల్వర్ గౌన్‌లో మలాలా(malala) ఇచ్చిన కొత్త లుక్‌ను ఆహుతులు స్వాగతించారు. తలపై ఎప్పుడూ దుపట్టా వేసుకునే మలాలా.. అదే తరహాలో గౌన్‌ను ప్రిఫర్ చేయడం గమనార్హం.
ఇక ఆస్కార్స్ ప్రజెంటేషన్ జరుగుతున్న సమయంలో.. హోస్ట్ జిమ్మీ కిమ్మల్(jimmy kimmel) వుమెన్ యాక్టివిస్ మలాలాను ఓ ప్రశ్న వేశాడు. ఆ సమయంలో ఎంతో సమయస్పూర్తితో మలాలా ఆన్సర్ ఇచ్చింది. హాలీవుడ్లో నడుస్తున్న స్పిట్‌గేట్(spitgate) గురించి హోస్ట్ జిమ్మీ ప్రశ్న వేయగా.. మలాలా ఆ ప్రశ్నకు బదులిస్తూ తాను కేవలం శాంతి గురించి మాత్రమే మాట్లాడనున్నట్లు చెప్పింది.
ఆక్స్ఫర్డ్ వర్సిటీ(oxford university) నుంచి ఫిలాసఫీ, ఎకానమీ, పాలిటిక్స్ సబ్జెక్ట్స్‌లో మలాలా గ్రాడ్యుయేట్ అయ్యింది. పాక్‌లో బాలికల విద్య(girls education) గురించి పోరాటం చేసిన మలాలాపై తాలిబన్లు దాడి చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

