న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయి(Malala Yousafzai) యాక్టింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. బ్రిటీష్ సిట్కామ్ వీ ఆర్ లేడీ పార్ట్స్ అన్న సిరీస్లో ఆమె నటిస్తోంది. ఆ సిరీస్కు చెందిన సెకండ్ సీజన్ త్వరలో ప్రసారం కానున్నది. కామెడీ షోలో మలాలా నటించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై కొందరు నెటిజెన్లు ఫైర్ అయ్యారు. తలకు కౌబాయ్ హ్యాట్, గుర్రాన్ని నడిపిస్తూ ఉన్న మలాలా ఫోటోను రిలీజ్ చేశారు. సీజన్ 2లోని మలాలా మేడ్ మీ డూ ఇట్ అన్న టైటిల్ ఉన్న ఎపిసోడ్లో మలాలా కనిపించనున్నది. ఆమెతో పాటు ఆ షోలో అంజనా వాసన్, సారా కమీలా ఇంపే, జులియట్ మొతామెడ్, లూసీ షార్ట్హౌజ్, ఫెయిత్ ఒమోల్ నటిస్తున్నారు.
As a Muslim doctor who talks about Lady Parts all day long & believes everyone should as well 😄
I’m so happy that this gem of a comedy about an all female Muslim British punk rock band named Lady Parts is back for season 2 on @Channel4 with special guest @Malala, clad in head… pic.twitter.com/1Eb7IifNJm
— 𝑫𝒓 𝑵𝒊𝒈𝒉𝒂𝒕 𝑨𝒓𝒊𝒇 (@DrNighatArif) May 30, 2024