కింగ్ నాగార్జున మంచి జోరు మీదున్నాడు. ఆ మధ్య వైల్డ్ డాగ్‌తో పలకరించిన నాగ్ ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. వైల్డ్ డాగ్ సినిమాలో పూర్తి స్థాయి యాక్షన్ క్యారెక్టర్ చేసిన నాగార్జున మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లారు. చిత్ర తొలి షెడ్యూల్ గోవాలో జరిపిన మేకర్స్ ఇప్పుడు హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు . ఇందులో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్ రోల్లో కనిపించనున్నారు.
తాజాగా మేకర్స్ నాగార్జున వర్కింగ్ స్టిల్ విడుదల చేశారు. ఈ లుక్ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ మధ్య బ్యాక్ లుక్ విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు ఫ్రంట్ లుక్ రివీల్ చేశారు. చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కథానాయికగా నటిస్తుండగా, నారాయణ్‌దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్ సుదీర్ఘంగా ఉండనుంది. ఇందులో సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించబడతాయి.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరో భారీ షెడ్యూల్ విదేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్ నటిస్తోంది. మరోవైపు జబర్ధస్త్ భామ రష్మి గౌతమ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఇండియాలోని పలు సిటీస్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరపనున్నారు. మరోవైపు నాగార్జున బంగార్రాజు ప్రీక్వెల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.