Yatra 2 | టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు మహి వి రాఘవ్ (Mahi V Raghav). ఈ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి 2019లో వచ్చిన పొలిటికల్ జోనర్ ప్రాజెక్ట్ యాత్ర (Yatra). ఏపీ (పూర్వ ఆంధ్రప్రదేశ్) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ బయోపిక్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు. తాజాగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచేందుకు సీక్వెల్ యాత్ర 2 (Yatra 2) రెడీ అవుతోంది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్‌లో వైఎస్సార్ (తండ్రి)పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా.. వైఎస్ జగన్ (కొడుకు పాత్ర)గా కోలీవుడ్ యాక్టర్ జీవా లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు డైరెక్టర్. వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణంలో అప్పటి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ కూడా ఉంటుందని తెలిసిందే.
ఈ చిత్రంలో కథానుగుణంగా సోనియాగాంధీ పాత్ర ఉండనుండగా.. ఈ రోల్లో కనిపించబోయే నటి ఎవరో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. సోనియాగాంధీ రోల్లో జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ నటిస్తోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశాడు. సోనియాగాంధీకి కాపీలా ఉన్న సుజానే లుక్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. జర్మనీలో జన్మించిన సుజానే కమర్షియల్ యాడ్స్, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. మరి సుజానే బెర్నెర్ట్ యాత్ర 2లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
కాగా యాత్ర 2లో ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉండనుండగా.. ఈ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) కనిపించబోతున్నారని ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
యాత్ర 2ను Three Autumn Leaves, V Celluloid సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏపీ ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యాత్ర 2 నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. యాత్ర 2 2024 ఫిబ్రవరి 8న విడుదలవుతుంది.
యాత్ర 2 సోనియాగాంధీ లుక్..
Their Paths crossed,
The Dynasty Collapsed,
The History changed !#Yatra2 #Yatra2OnFeb8th #LegacyLivesOn @MahiVraghav @ShivaMeka @Music_Santhosh @madhie1 #SelvaKumar @vcelluloidsoffl @3alproduction pic.twitter.com/wNoyyReZtJ
— BA Raju’s Team (@baraju_SuperHit) November 7, 2023
Yatra 2: Update 🎬
Introducing Suzanne Bernert as Sonia Gandhi – a German actress based in India, Suzanne did some movies, web series, and Hindi serials📺
She looks remarkably apt as Sonia Gandhi!#Yatra2 #Yatra #Yatra2OnFeb8th #Jiiva #MaheshManjarekar #Mammootty… pic.twitter.com/EgPI90eIz4
— Uma Madhavi (@mrs_persistent) November 7, 2023
యాత్ర 2 షూటింగ్ స్టిల్..
Shooting on progress!#Yathra2@mammukka #Mammootty#Yatra2 #KannurSquad #kathalthecore #Bramayugam #Bazooka #Bilal pic.twitter.com/PvQHGdqFec
— കിമോത്തി അൽബാനി (@Junaidjunu3698) September 22, 2023
యాత్ర 2 మోషన్ పోస్టర్..