SSMB29 | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Maheshbabu) అభిమానుల ఫోకస్ అంతా ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29)పైనే ఉంది. గుంటూరు కారం సక్సెస్ తర్వాత జక్కన్న, మహేశ్‌బాబు గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ అప్డేట్స్ గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబీ 29 మూవీ హాలీవుడ్ రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని ఇప్పటివరకు వచ్చిన వార్తలు చెబుతున్నాయి. మహేశ్ బాబు సినిమాలతోపాటు యాడ్స్‌కు కూడా సూపర్ క్రేజ్ ఉంటుందని తెలిసిందే.
కూల్ డ్రింక్ మౌంటెయిన్ డ్యూను ప్రమోట్ చేస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా మౌంటెయిన్ డ్యూ కొత్త యాడ్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆపదలో ఉన్న స్నేహితుడికి సాయం చేసేందుకు మహేశ్ బాబు చేసే రిస్కీ స్టంట్స్‌తో కట్ చేసిన యాడ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎస్ఎస్ఎంబీ 29 కూడా ఇలా గూస్బంప్స్ తెప్పించే రిస్కీ షాట్స్, సన్నివేశాలతో ప్రేక్షకులను రక్తకట్టించేలా ఉండబోతుందని తాజా వీడియోతో హింట్ ఇచ్చేశాడంటున్నారు సినీ జనాలు.
ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 29 గురించి.. మిక్స్డ్ స్టిల్ షేర్ చేస్తూ.. క్యాప్షన్ లేదు.. ఫొటో చాలా మాట్లాడుతుంది.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతోంది.. ఇప్పటికే ఆన్లైన్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో పాపులర్ హాలీవుడ్ యాక్టర్‌తోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ చిత్రాన్ని జక్కన్న టీం 2026 ఉగాది కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో ఒకరైన జక్కన్న కాంపౌండ్ రాబోతున్న ఈ సినిమా కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేసినట్టు ఇప్పటికే టాలీవుడ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జక్కన్న పర్యవేక్షణలో మహేశ్ బాబు లుక్ టెస్ట్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోండగా.. ఇప్పటివరకు 8 లుక్స్ ఫైనల్ చేశారట. కాగా మహేశ్ బాబును నయా అవతార్‌లో జక్కన్న ఎలా చూపించబోతున్నాడోనని చూసేందుకు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
మౌంటెయిన్ డ్యూ కొత్త యాడ్..
Sensational and Stunning Superstar @urstrulyMahesh 😍 in latest Mountain Dew AD #MaheshBabu #SSMB29 pic.twitter.com/HPUs4azYq1
— GlobalTrending24 (@GlobalTrendng24) March 10, 2024
ఎస్ఎస్ఎంబీ 29 నయా అప్డేట్..
No Caption… Picture speaks a lot !!
ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.#SSMB29 🔥 pic.twitter.com/3BEV10srNS
— Rajesh Manne (@rajeshmanne1) January 23, 2024