Bigg Boss OTT Telugu | బిగ్‌బాస్ ఓటీటీ నాన్ స్టాప్‌ను ఈసారి వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ థీమ్‌తో సెట్ చేశారు. ఇప్పటికే తొలి వారియర్‌గా బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ అషు రెడ్డి వెళ్లింది. పిచ్చెక్కిస్తా అంటూ అషురెడ్డి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. తర్వాత రెండో వారియర్‌గా ఊర మాస్ అంటూ మహేశ్ విట్ట బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు.
మహేశ్ విట్ట కూడా బిగ్ బాస్ 3 కంటెస్టెంటే. ఎటువంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన మహేశ్ విట్ట.. 12 వారాల పాటు హౌస్‌లో కొనసాగాడు. ఈసారి మాత్రం ఎలాగైనా కప్పు కొట్టి బయటికి వెళ్తా అని మహేశ్.. హోస్ట్ నాగార్జునకు చెప్పాడు.