Rajamouli – Mahesh Project | దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో పాటు మహేశ్ – రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిషాలో శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ షూటింగ్‌కి సంబంధించి ఒక వీడియో ఆన్లైన్లో లీక్ అయ్యింది. మహేశ్ బాబు నడుచుకుంటూ వచ్చి వీల్ చైర్లో ఉన్న అతడిముందు మోకాలిపై ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వీడియో లీక్ అవ్వడంపై రాజమౌళి సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి ఎటువంటి లీక్‌లు నటులు బయటపెట్టవద్దని అగ్రిమెంట్ తీసుకున్న రాజమౌళి ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.