e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News Mahesh: స్పెయిన్ షెడ్యూల్ ప్లాన్ చేసిన స‌ర్కారు వారి పాట టీం..!

Mahesh: స్పెయిన్ షెడ్యూల్ ప్లాన్ చేసిన స‌ర్కారు వారి పాట టీం..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌. ప‌రశురాం తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణం నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఇందులో కీర్తి సురేష్ కథానాయిక‌గా న‌టిస్తుంది.

సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజా షెడ్యూల్‌ని స్పెయిన్‌లో ప్లాన్ చేశార‌ట‌.ఇందు కోసం చిత్ర బృందం అంతా స్పెయిన్ వెళ్ల‌నున్నార‌ని, వచ్చేవారం నుంచి ఈ కొత్త షెడ్యూల్ షూటింగ్ అక్క‌డ‌ మొదలుకానుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ నెలాఖరువరకూ ‘స్పెయిన్’లోనే చిత్రీకరణ జరగనుంది. ఈ షెడ్యూల్‌తో 80 శాతం షూటింగ్ పూర్తి కానుంద‌ట‌. జ‌న‌వ‌రి 13న చిత్రాన్ని విడుద‌ల చేసే ప్లాన్ లో మేక‌ర్స్ ఉన్నారు. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్‌.. త్రివిక్ర‌మ్, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేయ‌నున్నాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement