Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుండగా, త్వరలో మూడో షెడ్యూల్ జరుపుకోనుంది. అందుకే మహేష్ బాబు తన వెకేషన్ పూర్తి చేసుకొని హైదరాబాద్లో అడుగుపెట్టారు. రెడ్ కలర్ జాకెట్, లోపల బ్లూ టీ షర్ట్, బ్రౌన్ ప్యాంట్ లో మహేష్ బాబు విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడంతో కెమెరాలు అన్ని ఆయన చుట్టే తిరిగాయి. ప్రతి ఒక్కరు మహేష్ బాబుని తమ కెమెరాలలో బంధించేందుకు పోటీ పడ్డారు. మహేష్ బాబు లేటెస్ట్ లుక్స్ అదిరిపోయాయని నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక రాజమౌళి కూడా ఇటీవల జపాన్ వెళ్లారు. ఆర్ఆర్ఆర్ మూవీ డాక్యుమెంటరీ వెర్షన్ జపాన్ లో విడుదల అయిన సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఆయన కూడా హైదరాబాద్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూడో షెడ్యూల్ని వీలైనంత త్వరగా మొదలు పెట్టనున్నారు. అంతేకాకుండా త్వరలోనే మహేష్ బాబు, రాజమౌళి, పృథ్వీ రాజ్, ప్రియాంక చోప్రా కలిసి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నారట. ఈ ప్రెస్ మీట్ లో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్ని ఇవ్వనున్నట్టు సమాచారం. సినిమా స్టోరీ లైన్ ఏంటనేది కూడా ఆ రోజు రివీల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాకి కథను విజయేంద్రప్రసాద్ రాశారు. జంగిల్ ఎడ్వంచర్ కథగా దీనిని చిత్రీకరిస్తుండగా, దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఆస్కార్ అవార్డులలో ఈ సినిమా యాక్షన్ కేటగిరిలో అవార్డుల కోసం ఎంట్రీ కి పంపనున్నట్లు సమాచారం. 2028లో 100 ఏళ్ళ ఆస్కార్ వేడుక జరగనుండగా, ఈ సినిమాకి ఏదో కేటగిరీలో అవార్డ్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హాలీవుడ్ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఎడ్వంచర్ మూవీగా దీనిని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలను, వి.ఎఫ్.ఎక్స్ సిబ్బందిని ఇప్పటికే రాజమౌళి కలిసినట్లు వెల్లడించారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయినా?, లేకపోతే ఆమె కూడా విలనా? అనే దానిపై కూడా స్పష్టత లేదు . 2027 వ సంవత్సరం లో ఎట్టిపరిస్థితిలోనూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు.