SSMB 29 | మహేష్‌బాబుకు, రాజమౌళి సినిమా నిబంధనలు వర్తించవా?
ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి, హీరో మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పట్నుంచో ఈ కాంబినేషన్లో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు మహేష్ అభిమానులు. ఎట్టకేలకు వారి కోరిక త్వరలోనే తీరబోతుంది
ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి, హీరో మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పట్నుంచో ఈ కాంబినేషన్లో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు మహేష్ అభిమానులు. ఎట్టకేలకు వారి కోరిక త్వరలోనే తీరబోతుంది. ఈ ఇద్దరి కలయికలో రూపొందనున్న చిత్రం 2025, జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో వున్నారు. మహేష్ కూడా రాజమౌళి చిత్రంలో కనిపించబోయే మేకోవర్ పనిలో వున్నాడు.
ఈ చిత్రంలో ఈ సూపర్‌స్టార్ గుబురు గడ్డం, లాంగ్‌హెయిర్‌తో కనిపించబోతున్నాడు. ఇటీవల పలు వేడుకల్లో మహేష్ ఇదే లుక్‌లో మీడియాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన మహేష్‌ను ఆలుక్లో చూసి ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రాజమౌళి సినిమాలో తమ హీరో లుక్ అదిరిపోయింది అంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోలు మేకోవర్‌లో వున్నప్పుడు, అనుకోకుండా బయటి వెళ్లాల్సి వచ్చిన వాళ్ల మేకోవర్‌ను కనిపించడకుండా జాగ్రత్తపడేవారు.
వీలున్నంత వరకు ఆ సినిమా ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేసే వరకు పబ్లిక్ వేడుకల్లో కనబడకుండా వుండే వారు. ఇందుకు దర్శకుడు రాజమౌళి కూడా ఒప్పుకునేవారు కాదు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు రాజమౌళి సినిమా నిబంధనలు పాటించనవారే.అయితే మహేష్‌బాబుకు మాత్రం ఈ విషయంలో రాజమౌళి ఎలాంటి షరతులు విధించలేదని సమాచారం. మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమా మేకోవర్‌లో వున్నా తరచుగా ఫంక్షన్ల్లో పాల్గొంటూ, పబ్లిక్‌లో కనిపిస్తూ లాంగ్‌హెయిర్, గుబురు గడ్డంతో ఫోటోలు కూడా ఇస్తున్నారు. అయితే హీరో మేకోవర్‌లో ఇది ప్రారంభం మాత్రమేనని, ఇంకా రాజమౌళికి కావాల్సిన మేకోవర్‌లో మహేష్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని అంటున్నారు రాజమౌళి సన్నిహితులు.
Read More :
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!
Devara Movie | ‘దేవర’ రిలీజ్.. ఎన్టీఆర్ అభిమానులను నిర్మాత నాగవంశీ రిక్వెస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

