Mahesh Babu Gym Video | ఇంకా ముహూర్తం కూడా సాగని మహేష్-రాజమౌళి సినిమాపై ఇప్పటికే వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. పైగా ఆర్ఆర్ఆర్ వంటి బంపర్ హిట్ తర్వాత జక్కన్న తెరెక్కిస్తున్న సినిమా కావడంతో యావత్ సినీ అభిమానులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే రాజమౌళి స్టోరీ లైన్ చెప్పి సినీ అభిమానుల్లో తిరుగులేని అంచనాలు నెలకొల్పాడు. పైగా పాన్ వరల్డ్ రేంజ్ సినిమా అంటూ సోషల్ మీడియా హైప్‌తోనే మహేష్ అభిమానుల హార్ట్ బీట్ రెండు రెట్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. ఇక ఇప్పుడు రాజమౌళి రేంజ్ హాలీవుడ్‌కు ఎగబాకింది. ఆయన సినిమా కోసం మనమే కాదు మైల్ల దూరంలో ఉన్న పక్క దేశ సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
ఇక మహేష్ సైతం ఈ సినిమా కోసం ఎంతైనా కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాడట. మాములుగా ఇండస్ట్రీలో మహేష్‌ను చాలా సాఫ్ట్ అని.. ఎక్కువగా రిస్క్‌ల జోలికి వెళ్లడు అని అంటుంటారు. అయితే రాజమౌళి సినిమా కోసం కండలు పెంచుతూ, జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ నిత్యం కనిపిస్తున్నాడు. తాజాగా ఆయన జిమ్ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మహేష్ శనివారం జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. నా ఫేవరెట్ స్కిల్ మిల్ ఫినిషర్‌తో నా శనివారం మొదలైంది. ఒక నిమిషం ల్యాండ్‌మైన్ ప్రెస్, ఒక నిమిషం కెటిల్‌బెల్ స్వింగ్స్, ఒక నిమిషం స్కిల్‌మిల్ రన్ పూర్తి చేశాను. మీరు ఎన్ని సెట్స్ చేయగలరు అంటూ ప్రశ్నిస్తూ వీడియోను పోస్ట్ చేశాడు.
దీనిపై పలువురు నెటిజన్లు మహేష్ యంగ్‌లుక్‌లో కనడటానికి రహస్యం ఇదేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు రాజమౌళి సినిమా కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టారా అని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారంతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.