Guntur kaaram Review | త్రివిక్రమ్-మహేశ్‌బాబు గుంటూరు కారంతో మెప్పించారా..?
Guntur kaaram Review | మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram Srinivas).. క్రేజీ కాంబినేషన్ ఇది. సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గుంటూరు కారం' ఎలాంటి వినోదాల్ని పంచింది ? మహేష్ , త్రివిక్రమ్ మరో మ్యాజిక్ క్రియేట్ చేశారా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్దాం..
Guntur kaaram Review | మహేష్ బాబు (Mahesh Babu) , త్రివిక్రమ్ (Trivikram Srinivas).. క్రేజీ కాంబినేషన్ ఇది. వీరిద్దరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులని అమితంగా అలరించాయి. చాలా విరామం తర్వాత ఈ ఇద్దరూ హ్యాట్రిక్ సినిమా ‘గుంటూరు కారం’ (Guntur kaaram) కోసం జతకట్టారు. ఈ సినిమా ప్రకటనతోనే అంచనాలు పెరిగాయి. ప్రచార చిత్రాలు ఆ అంచనాలని మరోస్థాయికి తీసుకెళ్ళాయి. సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గుంటూరు కారం’ ఎలాంటి వినోదాల్ని పంచింది ? మహేష్ , త్రివిక్రమ్ మరో మ్యాజిక్ క్రియేట్ చేశారా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్దాం.
కథ గురించి:
సత్యం (జయరామ్), వసుంధర (రమ్యకృష్ణ)ల కొడుకు రమణ (మహేశ్‌బాబు). సత్యం ఓ హత్య కేసులో జైలుకి వెళ్తాడు. వసుంధర ఐదేళ్ళ కొడుకు రమణని వదిలేసి రెండో పెళ్లి చెసుకుంటుంది. రమణ గుంటూరులో తన మేనత్త బుజ్జి (ఈశ్వరిరావు) దగ్గర పెరుగుతాడు. పాతికేళ్ళు గడుస్తాయి. వసుంధర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగి మంత్రి అవుతుంది. వసుంధర తండ్రి వైరా వెంకటస్వామి (ప్రకాశ్‌రాజ్). వసుంధరకి పుట్టిన రెండో కొడుకుని వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాడు. తన ప్రయత్నానికి వసుంధర మొదటి కొడుకు రమణ భవిష్యత్ లో అడ్డురావచ్చని భావించిన వెంకటస్వామి… వసుంధరతో రమణ అన్నీ రకాలుగా తెగతెంపులు చేసుకునే విధంగా అగ్రిమెంట్ రెడీ చేసి, దానిపై రమణతో సంతకం పెట్టించుకునే బాధ్యత లాయర్ ఫణి( మురళీ శర్మ)కి అప్పగిస్తాడు. మరి రమణ …ఆ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టాడా? అసలు కన్నకొడుకుని వసుంధర ఎందుకు దూరం పెట్టింది? రమణకి తన తల్లిపై వున్న ప్రేమ ఎలాంటిది ? అసలు ఈ కథలో విలన్ ఎవరు ? ఇవన్నీ తెరపై చూడాలి.
కథా విశ్లేషణ:
తల్లీకొడుకుల ప్రేమకథ ఇది. త్రివిక్రమ్ కథల్లో కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వుంటుంది. గుంటూరు కారం కథలోని ప్రధాన అంశం కూడా కుటుంబమే. ముఖ్యంగా తల్లీ కొడుకుల నేపధ్యంలో ఒక ప్రేమకథగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనలో చాలా నవ్యత వుంది. ఇలాంటి నేపధ్యంలో చిత్రాలు పెద్దగా రాలేదనే చెప్పాలి. కథ పరంగా చాలా బలమైన పాయింట్ ఇది. తనదైనశైలిలో మహేష్ బాబు ఫ్యాన్స్ ని ద్రుష్టిలో పెట్టుకొని ఆయనలో మాస్ కోణాన్ని మరింతగా ఆవిష్కరిస్తూ ఈ కథని నడిపాడు త్రివిక్రమ్. మహేష్ బాబు పరిచయ సన్నివేశాలు, పార్టీ ఆఫీస్ లో తను సృష్టించే రభస, తర్వాత వచ్చే దమ్ మసాలా బిర్యానీ పాట .. ఇవన్నీ కథకు చాలా మంచి టేకాప్ ఇచ్చాయి. తొలి సగం రమణ సంతకం చుట్టూనే కథ నడుస్తుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాల్లో కాస్త నెమ్మదిగా రీపిట్ గా సాగుతున్న భావన కలిగించినప్పటికీ మహేష్ మ్యానరిజం, శ్రీలీల డ్యాన్సులు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లతో సరదాగా గడిచిపోతుంది.
కథ ఎంత గంభీరంగా వున్నా దాన్ని లైటర్ వెయిన్ లో చెప్పడం త్రివిక్రమ్ స్టయిల్. గుంటూరు కారంలో అదే ఫాలో అయ్యారు. సెకండ్ హాఫ్ లో వచ్చే తల్లీ కొడుకుల సెంటిమెంట్ సీన్లు హత్తుకుంటాయి. ‘అమ్మని ఎప్పుడూ బిడ్డలకు ఏం చేశావని అడక్కు’, ‘అమ్మని కలవాలని అనుకొన్నా, గెలవాలని అనుకోలేదు’ లాంటి డైలాగులు త్రివిక్రమ్ మాటల్లోనే పదునుని తెలియజేస్తాయి. ఇందులో బలమైన విలన్ ఎవరూ బయటికి కనిపించరు. నిజానికి ఒక కుటుంబ కథలో పరిస్థితులే విలన్ గా వుంటాయి. త్రివిక్రమ్ కూడా అలాంటి విలన్ నే సృష్టించారు. ఒక కొడుకు కోసం తల్లి ఎన్ని త్యాగాలు చేయగలదో చెప్పే సన్నివేశాలు మనసుని కదిలిస్తాయి.
నటీనటుల నటన:
గుంటూరు కారం మహేష్ బాబు వన్ మ్యాన్ షో. ఖలేజాతో మహేష్ కు ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఇచ్చిన త్రివిక్రమ్ గుంటూరు కారంలో మాస్ ని మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఇందులో మహేష్ డైలాగ్స్, మేనరిజం, మాస్ ఫైట్స్, డ్యాన్స్ అభిమానులు విందుగా వుంటాయి. ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నారు. శ్రీలీల పాత్రకు అంత ప్రాధాన్యత లేదు కానీ.. తన డ్యాన్స్ లు మాత్రం అలరిస్తాయి. మీనాక్షి చౌదరి కేవలం ఓ సైడ్ క్యారెక్టర్ గానే మిగిలిపోయింది. రమ్యకృష్ణ అనుభవం ఆ పాత్రని హుందాగా నిలబెట్టింది. ప్రకాష్ రాజ్ కు ఇలాంటి పాత్రలు చేయడం అలవాటే. ఆయన నటన ఆకట్టుకుంటుంది. జయరాం, రావు రమేష్, ఈశ్వరిరావు, మురళి శర్మ, వెన్నెల కిషోర్ పాత్రలు అలరిస్తాయి. జగపతి బాబు పాత్రకు అంత ప్రాధాన్యత కనిపించదు. మిగతా పాత్రలు పరిధి మేరవున్నాయి.
టెక్నికల్ :
తమన్ మాస్ పాటలు అలరించాయి. కుర్చీని మడతపెట్టి, టైటిల్ సాంగ్ థియేటర్స్ లో అదరగొట్టాయి. నేపధ్య సంగీతం కూడా సాలిడ్ గా చేశాడు. కెమరా పనితనం డీసెంట్ గా వుంది. విజువల్స్ కలర్ ఫుల్ గా వున్నాయి. మిర్చి యార్డ్ సెట్ సహజంగా తీర్చిదిద్దారు. యాక్షన్ సీక్వెన్స్ లని రిచ్ గా తీర్చిదిద్దారు. హారిక హాసిని నిర్మాణ విలువలు బావున్నాయి.
ప్లస్ పాయింట్స్..
మహేష్ బాబు క్యారెక్టర్, మాస్ ఎలిమెంట్స్, పాటలు, డ్యాన్స్, తల్లీ కొడుకుల సెంటిమెంట్
మైనస్ పాయింట్స్..
కథనంలో వేగం తగ్గడం, కథ ఊహకు అందిపోవడం
*రేటింగ్ : 3/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకున్న మహిళ.. ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం..
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

