Guntur Kaaram | మహేశ్ ‘గుంటూరు కారం’లో అదిరిపోయేలా చివరి 45 నిమిషాలు..: నిర్మాత నాగవంశీ
మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే.
Guntur Kaaram | మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. తమన్ స్వరపరచిన ఈ సినిమా గీతాలకు అద్భుతమైన ఆదరణ లభిస్తున్నది. ఇటీవల విడుదలైన ‘కుర్చీ మడతపెట్టి..’ పాట పర్ఫెక్ట్ మాస్ నంబర్‌గా ఆకట్టుకుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ..మహేష్‌బాబు అభిమానులతో ట్విట్టర్ వేదికగా ముచ్చటించారు. ఈ నెల 6వ తేదీన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
మహేష్‌బాబుతో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నానని..‘గుంటూరు కారం’తో అది నెరవేరిందన్నారు. ‘సంక్రాంతికి ఇంటిల్లిపాది ఎంజాయ్ చేసే సినిమా ఇది. మ్యూజిక్ మరో స్థాయిలో ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా చివరి 45 నిమిషాలు, ైక్లెమాక్స్ అదిరిపోయేలా ఉంటాయి. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో అదనపు షోల కోసం ప్రయత్నిస్తున్నాం’ అన్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

