Mahesh-Rajamouli Movie | మహేష్-రాజమౌళి సినిమా కోసం అభిమానులతో పాటు యావత్ ఇండియా మొత్తం అమితాసక్తితో ఎదురు చూస్తుంది. ఇప్పటికే రాజమౌళి స్టోరీ లైన్ చెప్పి సినీ అభిమానుల్లో తిరుగులేని అంచనాలు నెలకొల్పారు. పైగా పాన్ వరల్డ్ రేంజ్ సినిమా అంటూ సోషల్ మీడియా హైప్‌తోనే మహేష్ అభిమానుల హార్ట్ బీట్ రెండు రెట్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. ఇక ఇవన్నీ వింటుంటే సగటు సినీ ప్రేక్షకుడు సైతం ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా? అని ఎదురు చూస్తున్నాడు. పైగా ఇప్పుడు రాజమౌళి రేంజ్ హాలీవుడ్‌కు ఎగబాకింది. ఆయన సినిమా కోసం మనమే కాదు మైల్ల దూరంలో ఉన్న పక్క దేశ సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
కొన్ని నెలలుగా ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. రాజమౌళి తండ్రి విజేయేంద్ర ప్రసాద్ కనీవినీ ఎరుగని రీతిలో కథను సిద్ధం చేస్తున్నాడట. ఈ సినిమాలో మహేష్ ప్రపంచాన్ని చుట్టే మనిషిగా కనిపిస్తాడని రాజమౌళి ఎప్పుడు క్లారిటీ ఇచ్చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా కోసం మహేష్ బాబు తీసుకుంటున్న రెమ్యునరేషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం మహేష్ అక్షరాల రూ.110 కోట్లు తీసుకోబుతున్నాడని ఇన్సైడ్ టాక్. రాజమౌళితో సినిమా అంటే ఎలాగో రెండేళ్లు మరో సినిమా చేయడానికి వీలుండదు. ఈ క్రమంలో మహేష్ ఇంత మేర రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసినట్లు సమాచారం. మేకర్స్ సైతం మరోమారు ఆలోచించకుండా అడిగిన రెమ్యునరేషన్‌కు ఓకే చెప్పారట.
ఇటీవలే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేశారు. ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేశారని తెలిసింది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు నవంబర్‌లో ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో షూట్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించే ముందు మహేష్ బాబు ప్రత్యేకమైన శిక్షణ తీసుకోనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ సాగనుంది. ఇది ఎంతో సాహసోపేతమైన కథ అని విజయేంద్ర ప్రసాద్ ఇదివరకే వెల్లడించారు. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో మాములు అంచనాల్లేవు.