Mahesh Babu | టాలీవుడ్ ఇండస్ట్రీకి వారసుల అరంగేట్రం కొత్తేమి కాదు. కాకపోతే ఈసారి రెండు ప్రముఖ కుటుంబాల నుంచి ఆసక్తికరమైన కొత్త జోడీ సినీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, సీనియర్ నటుడు రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేని హీరోయిన్గా డెబ్యూట్ ఇవ్వబోతుండగా, ఆమెకి జోడీగా దర్శకుడు తేజ కుమారుడు హీరోగా తెరంగేట్రం చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ఇద్దరూ నటించే చిత్రం ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుందని సమాచారం. యూత్‌ను ఆకట్టుకునే కంటెంట్ తో, భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కనుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ, ఈ జంటపై ఇప్పటికే సోషల్ మీడియాలోను, సాధారణ ప్రేక్షకుల్లో మంచి హైప్ ఏర్పడింది. భారతి ఇటీవల సోషల్ మీడియాలో ఓ పాటకి కుర్చీ మడతపెట్టి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ఆమె లుక్, గ్రేస్ చూసిన నెటిజన్లు “ఈమె డెఫినిట్‌గా హీరోయిన్ మెటీరియల్” అని కామెంట్లు చేసారు. ఇక దర్శకుడు తేజ కుమారుడు బాలనటుడిగా కొన్ని సినిమాల్లో కనిపించినా, ఈ సినిమా ద్వారా ఫుల్‌లెంగ్త్ హీరోగా తొలి అడుగులు వేయనున్నాడు. ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించేది ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు కాని, తేజ స్వయంగా ఈ సినిమా పర్యవేక్షించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
ఈ ప్రాజెక్టుకు మహేష్ బాబు సపోర్ట్ కూడా ఉండొచ్చన్న మాటలు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కుటుంబాలకి సన్నిహితంగా ఉండే బేనర్ నుంచే సినిమా వచ్చేందుకు అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే భారతి మరియు తేజ కుమారుడు ఇద్దరూ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. టాలెంట్ మరియు ఫిల్మ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కలగలిసిన ఈ కొత్త జంట, టాలీవుడ్లో ఎంతవరకూ ప్రభావం చూపిస్తుందో చూడాల్సిందే. మొత్తానికి టాలీవుడ్‌కు మరో ఫ్రెష్ జోడీ రాబోతోంది. స్క్రీన్‌పై వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.