షరతుల చిట్టా విప్పి సందీప్‌రెడ్డి వంగా ఆగ్రహానికి గురై ‘స్పిరిట్’ అవకాశాన్ని చేజార్చుకున్న బాలీవుడ్ భామ దీపికా పదుకొనే.. రీసెంట్గా అల్లు అర్జున్, అట్లీ సినిమాకు సైన్ చేసింది. దాంతో ఒకచోట పోగొట్టుకున్న అవకాశం మరోచోట దక్కినట్టయ్యింది ఈ అందాలభామకు. ‘కల్కి 2898ఏడీ’లో ప్రభాస్.. అట్లీ సినిమాతో బన్నీ.. ప్రస్తుతానికి టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు అగ్రహీరోలు కవర్ అయిపోయారు. అయితే.. దీపికా తీరు చూస్తుంటే వీరిద్దరితో ఆగేలా లేదు. టాలీవుడ్ అంతా కవర్ చేసేందుకు ప్రణాళికలే రచిస్తున్నట్టుంది ఈ బెంగళూరు భామ.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ‘నేను టాలీవుడ్లో మహేష్, తారక్‌ల అభిమానిని. వారిద్దరూ నటనలో మాస్టర్స్. వారితో కలిసి నటించాలనుంది.’ అంటూ పేర్కొన్నది. దీపికా నోటి వెంట మహేష్, తారక్‌ల ప్రస్తావన రావడం ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. గతంలో టాలీవుడ్లో మీకెవరు తెలుసు? అనడిగితే ‘మహేష్’ అని అదోలా నవ్వుతూ.. మిగతా హీరోలెవరూ తెలీనట్టు ప్రవర్తించిన దీపిక.. ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు భజన చేయడం చూసి.. ‘మార్పు మంచిదే’ అంటూ వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.