MAD Square | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ మ్యాడ్ స్క్వేర్ (MAD Square). సూపర్ హిట్ చిత్రం మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుంది. మొదటి పార్ట్‌లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత నటులు ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ (MAD Square Trailer) ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఫస్ట్ పార్ట్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో రాగా.. సీక్వెల్ లడ్డుగాని పెళ్లి (విష్ణు ఓయ్) స్టోరీతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. లడ్డుగాని పెళ్లికి వచ్చిన మ్యాడ్ గ్యాంగ్ బ్యాచిలర్ పార్టీ అని గోవాకి వెళతారు. ఆ క్రమంలోనే అక్కడ ఏం జరిగింది అనేది స్టోరీ అని తెలుస్తుంది. ఇక మ్యాడ్ సినిమాలో వన్ లైనర్స్ కామెడీతో అలరించిన చిత్రబృందం ఇందులో కూడా అలాగే నవ్వించబోతున్నట్లు తెలుస్తుంది.