మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ జంటగా నటిస్తున్న సినిమా ‘మాటరాని మౌనమిది’. రుద్ర పిక్చర్స్, పీసీఆర్ గ్రూప్, పీబీవీ శ్రీనివాసులు సంయుక్త నిర్మాణంలో దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందిస్తున్నారు. అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్, శ్రీహరి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మిస్టరీతో కూడిన థ్రిల్లింగ్ లవ్‌స్టోరి ఈ చిత్రానికి కథా నేపథ్యంగా ఉండనుంది. ఆగస్ట్ 19న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్‌ల బ్లెస్సింగ్స్‌తో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసినట్లు చిత్ర బృందం తెలిపారు. ఒక అనూహ్య ఘటన నేపథ్యంతో ప్రేమ, మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో సాగిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ…‘పాన్ ఇండియా స్టార్స్ ఆశీస్సులతో మా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశాం. ఆ హీరోల అభిమానులంతా మా చిత్రానికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ప్రేమ కథ చుట్టూ కొన్ని ఆసక్తికర అంశాలను అల్లి రూపొందించిన చిత్రమిది. ఆద్యంతం ప్రేక్షకులకు థ్రిల్ పంచుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : చరణ్, సంగీతం : అషీర్ లూక్.