శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించిన చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మించారు. నేడు విడుదలవుతున్నది. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సినిమాలో తాను ముఖ్యమంత్రి పాత్రలో నటించానని, చక్కటి సందేశంతో ఈ కథ ఆకట్టుకుంటుందని సీనియర్ నటుడు సుమన్ పేర్కొన్నారు. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్‌గా సాగే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.