Maa elections | మా ఎన్నికలపై ఆ స్టార్ హీరోల అసంతృప్తి.. ఓటు వేయరా..?

Junior NTR reaction on maa elections | ఈ సారి మా అసోసియేషన్ ఎన్నికల్లో ఎలాంటి విమర్శలు లేకుండా స్మూత్‌గా చేసుకుందాం.. ఎవరినీ విమర్శించకుండా మన పనులు మనం చేసుకుంటూ ముందుకు పోదాం.. ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా విమర్శించకూడదు.. ఇవి ఎన్నికలు మొదలయ్యే ముందు అధ్యక్ష పీఠానికి పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ ( prakash raj ) చేసిన వ్యాఖ్యలు. ఎవరు ఎవరిని కించపరచకుండా మాట్లాడాలి.. ఒక్కరు కూడా విమర్శలు చేయకూడదు అని ఆయన గట్టిగా చెప్పాడు. ఇదంతా రెండు నెలల కిందటి మాట. కానీ ముందు అనుకున్న దానికంటే ఈ సారి మా ఎలక్షన్స్ మరింత దిగజారిపోయాయి. మంచు విష్ణు ( manchu vishnu ), ప్రకాశ్ రాజ్ ( Prakash raj ) ప్యానెల్స్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న రచ్చ చూసిన తర్వాత.. ఇది వరకు జరిగిన ఎన్నికలు చాలా నయం అంటున్నారు మా సభ్యులు.

అప్పట్లో రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీ చేసినప్పుడు కూడా గొడవలు జరిగాయి. అలాగే శివాజీ రాజా, నరేశ్ పోటీ చేసినప్పుడు కూడా ఇద్దరి మధ్య చాలా పెద్ద విమర్శల యుద్ధం జరిగింది. ఇంత జరిగినా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ అందరూ కలిసి పని చేసుకున్నారు. దానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోల సపోర్టు కూడా ఉంది. ఎన్నికల సమయంలో ఎలా ఉన్నా పోలింగ్ రోజు వాళ్లు వచ్చి ఓటు వేసి వెళ్లి పోయేవారు. కానీ పరిస్థితులు ఇప్పుడు అలా కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు ఈ సారి మా ఎన్నికలు జరుగుతున్న తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ( NTR ) తాను ఈసారి ఓటు వేయడానికి రావట్లేదని ఓపెన్‌గా చెప్పినట్లు జీవితా రాజశేఖర్ మీడియాకు తెలిపింది.

మా ఎలక్షన్స్ లో జరుగుతున్న పరిస్థితులు ఎన్టీఆర్‌కు అసలు నచ్చడం లేదని.. అందుకే ఆయన ఓటు వినియోగించుకోవడం లేదని జీవిత తెలిపారు. ఇది కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాట మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఇదే మాట మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి ఓటు వేయకుండా దూరంగా ఉండటమే మంచిదని వాళ్లు నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తారక్‌తో పాటు వెంకటేశ్, నాగార్జున, మహేశ్ బాబు లాంటి హీరోలు కూడా ఈసారి ఓటు వేయకూడదని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రత్యేకంగా కారణాలు కూడా ఏమీ లేవు ఎన్నికల కోసం తమపై తామే చేసుకుంటున్న విమర్శలు హీరోలకు నచ్చడం లేదని.. అందుకే ఓటు వేయకుండా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని సన్నిహిత వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అక్టోబర్ 10న మా ఎలక్షన్స్ జరగనున్నాయి. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఈసారి బరిలో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
ఇవి కూడా చదవండి..
Samantha Naga Chaitanya Divorce | అంత చిన్న గొడవ విడాకుల వరకు దారి తీసిందా.. అసలు కారణం ఇదే అట..
నాగ చైతన్య, సమంత నుంచి ఫ్యాన్స్ కోరుకునే చివరి కోరిక ఇదే కావచ్చు..
samantha: సమంత- నాగ చైతన్య విడాకులపై సామ్ ఫాదర్ స్పందన ఇదే..!
Jeevitha Rajashekar : మంచి చేయాలనుకోవడం తప్పా?
మా ఎన్నికలలో ఓటు వేయనని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్
విద్యుల్లేఖని విడాకులెప్పుడని అడుగుతున్న నెటిజన్స్.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన కమెడీయన్
Junior NTR reaction on maa elections
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

