రిమ్స్‌లో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల హవా
ఆదిలాబాద్ రిమ్స్‌లో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల హవా కొనసాగుతున్నది. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఏజెన్సీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల నియామకాలు
- తొమ్మిది ఉద్యోగాలను రద్దు చేసిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, నవంబర్ 12(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ రిమ్స్‌లో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల హవా కొనసాగుతున్నది. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఏజెన్సీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారిశుధ్య నిర్వహణ, ఆసుపత్రి, వైద్య కళాశాలలో వివిధ ఉద్యోగాల నియామకాలను అధికారులు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పచెబుతారు. ఇటీవల రిమ్స్‌లో చిన్న పిల్లల వార్డులో అగ్నిప్రమాదం జరిగిన తర్వాత కలెక్టర్ ఆసుపత్రి వైద్యసేవలను సమీక్షించారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంత మంది పనిచేస్తున్నరనే విషయంలో ఆరా తీయగా 423 మందికి ప్రతి నెల వేతనాలు చెల్లిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా.. కలెక్టర్ పరిశీలనలో 350 మంది ఉద్యోగులు ఉన్నట్లు తేలింది. మిగతా 50 మంది ఎక్కడ పని చేస్తున్నారనే విషయంతోపాటు వారు విధులు నిర్వహిస్తున్నారా? లేదా? వారి పేరిట వేతనాలు ఎవరు కాజేశారనే విషయం స్పష్టం కాలేదు. రెండు నెలల కిందట మెప్మా ద్వారా రిమ్స్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు చెల్లించగా, ప్రస్తుతం రెండు ఏజెన్సీలకు ఉద్యోగాల నియామకం, వేతనాల పంపిణీ బాధ్యతలు అప్పగించారు.
గుట్టు చప్పుడు కాకుండా నియామకాలు
రిమ్స్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఏజెన్సీలు గుట్టు చప్పుడు కాకుండా భర్తీ చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 11 ఉద్యోగాలను ఓ ఏజెన్సీ భర్తీ చేసింది. వీటిలో అసిస్టెంట్ లైబ్రేరియన్, నాలుగు ల్యాబ్ టెక్నిషనల్ గ్రేడ్-2, రెండు ల్యాబ్ అటెండెంట్, రెండు లైబ్రరీ అటెండెంట్లు, ఒక ఓటీ టెక్నిషన్ను ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు నియామక పత్రాలు వెలువరించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం కోసం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగాల వివరాలు, అర్హతలు, ఔట్ సోర్సింగ్ ఎంపిక కమిటీ కన్వీనర్‌గా ఉన్న జిల్లా ఎంప్లాయీమెంట్ అధికారితో ధ్రువీకరించుకొని ఏ ఏజెన్సీకి ఉద్యోగాలు కేటాయిస్తారో ప్రకటన ఇవ్వాలి. ఉద్యోగాల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి కమిటీ సభ్యులు అర్హులను ఎంపిక చేయాలి. వీరి జాబితాను కమిటీ సభ్యులు తయారు చేసి కమిటీ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌కు అందజేయాలి. కలెక్టర్ ఆమోదం తర్వాత నియామక పత్రాలు అందించాల్సి ఉండగా ఇటీవల నియామకం చేపట్టిన ఉద్యోగాలలో నిబంధనలు పాటించలేదని ఆరోపణలు రావడంతో వీటిల్లో 9 ఉద్యోగాలను కలెక్టర్ రద్దు చేసి, నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అండదండలతో ఏజెన్సీలు నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

