Naatu Naatu Song | ‘ఆర్ఆర్ఆర్’ విజయంలో కీరవాణి పాత్ర చాలానే ఉంది. తన పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాకు మరింత బాలాన్ని చేకూర్చాడు. ఎన్నో సార్లు రాజమౌళి తన సినిమాలకు బలం పెద్దన్న కీరవాణి సంగీతమేనని తెలిపాడు. తన విజన్‌కు కీరవాణి పర్ఫెక్ట్ మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని వెల్లడించాడు. నిజానికి రాజమౌళి ఒక్కోసారి కీరవాణి సంగీతానికి తగ్గట్లు సీన్లను డిజైన్ చేసుకుంటాడట. ఇక ఇదిలా ‘ఆర్ఆర్ఆర్’తో ఈ ఇద్దరికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో కీరవాణి మ్యూజిక్ టైటల్ కార్డ్స్ నుండే స్టార్ అవుతుంది. సింపుల్ సీన్‌ను కూడా కీరవాణి తన మ్యూజిక్‌తో వేరే రేంజ్‌కు తీసుకెళ్లాడు.
ఈ సినిమాతో దర్శకుడిగా రాజమౌళికి ఎంత గుర్తింపు వచ్చిందో.. సంగీత దర్శకుడిగా కీరవాణికి కూడా అంతే గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ‘నాటు నాటు’ పాటకైతే.. హాలీవుడ్ ప్రేక్షకులు కూడా నాటు స్టెప్పులేశారు. ఇక కీరవాణి మ్యూజిక్కు ఏకంగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్లు బెస్ట్ ఒరిజనల్ స్కోర్ ఆఫ్ ది ఇయర్‌కు ‘ఆర్ఆర్ఆర్’ను సెలక్ట్ చేశారు. అంతేనా.. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయింది. ఇది చాలదు టాలీవుడ్ గర్వపడడానికి. అయితే ఈ నాటు నాటు పాట వెనుకలా పెద్ద యుద్ధమే జరిగిందిట.
కాగా ‘నాటు నాటు’ పాట ఫైనల్ కావడానికి కీరవాణి, రాజమౌళికి ఏకంగా 20 ట్యూన్ల వరకు వినిపించాడట. ఇక ఈ పాట లిరిక్స్ రాయడానికి చంద్రబోస్‌కు 19నెలలకు పైగా సమయం పట్టిందట. తీరా ఉక్రెయిన్‌లో ఈ పాట షూటింగ్ అవుతున్నప్పుడు కీరవాణి, చంద్రబోస్‌కు ఫోన్ చేసి చివరి రెండు లైన్లు మార్చమన్నారట. అలా సంగ్ పర్ఫెక్షన్ కోసం లాస్ట్ వరకు కష్టపడ్డారట. ఇక ఇప్పుడు ఆ కష్టమే ఈ పాటను ఆస్కార్ వరకు వచ్చేలా చేసింది. అంతేకాకుండా ఈ పాటను షూట్ చేయడానికి 17టేకులు తీసుకున్నాడట. అంత కష్టం దాగి ఉంది గనుకే ఈ పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.