Lust Stories-2 Movie Trailer | ఐదేళ్ల క్రితం వచ్చిన లస్ట్ స్టోరీస్ సినిమా సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఆంథాలజీ సినిమాగా రూపొందిన ఈ మూవీలో నాలుగు కథలుంటాయి. నాలుగు ఒకదానికొకటి సంబంధలేకుండా ప్రేమ, వ్యామోహం, శృంగారం లాంటి పలు విషయాల సమ్మేళంగా రూపొందింది. అంతకు ముందు పలు ఆంథాలజీ సినిమాలు వచ్చిన లస్ట్ స్టోరీస్ సృష్టించిన సంచలనం మాములుది కాదు. పచ్చి బూతులు, బోల్డ్ సన్నివేశాలతో బాలీవుడ్లో కొత్త ట్రెండ్ కు నాంది పలికింది. అప్పటివరకు బోల్డ్ అంటే కాసిన్ని హద్దులు కనిపించేవి. కానీ ఈ సినిమాతో హద్దులు చెరిగిపోయాయి. కియారా అద్వానీ, విక్కీ కౌశల్, భూమి ఫడ్నేకర్, మనీషా కొయిరాల, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో నెట్ ఫ్లి్క్స్ లో రికార్డు స్థాయి వ్యూస్ ను రాబట్టింది. ఇక ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. లస్ట్ స్టోరీస్-2 పేరుతో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ ఆంథాలజీ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ట్రైలర్ చూస్తుంటే తొలిపార్ట్ కు మించి బోల్డ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కారు కొనేముందు టెస్ట్ డ్రైవ్ చేసినట్లు పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా అంటూ సీనియర్ నటి నీనా గుప్తా చెప్పిన డైలాగ్ చాలదు ఈ సినిమాలో ఎంత బోల్డ్ కంటెంట్ ఉందో అని. పైగా లవ్ బర్డ్స్ గా పిలిచే తమ్మనా, విజయ్ వర్మల మధ్య రొమాన్స్ కాస్త ఎక్కువ మోతాదులోనే ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. మృనాళ్ థాకూర్ కూడా ఈ సినిమాలో భాగం అవడంతో ఈ ఆంథాలజీ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. టీజర్ లో పెద్దగా బోల్డ్ షాట్స్ ఏమి చూపించలేదు కానీ, తొలిపార్టులో సగం బోల్డ్ ఉన్నా ఈ సినిమా స్రీమింగ్ అయిన క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్ ను రాబడుతుంది. కాజోల్ కు సంబంధించిన స్టోరీ బాగా ఉండబోతుందని తెలుస్తుంది.
ఈ నాలుగు స్టోరీల ఆంథాలజీకి అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకనాసేన్ శర్మ, ఆర్ బాల్కి, సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఈ సీక్వెల సినిమా జూన్ 29 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.