‘లూసిఫర్’ (2019) చిత్రం మలయాళంలో మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి ‘ఎల్2 ఎంపురాన్’ పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. మోహన్‌లాల్ కథానాయకుడు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌లాల్..అండర్‌వరల్డ్ డాన్ ఖురేషి అబ్రమ్ పాత్రలో కనిపించనుండగా, ఆయన రైట్‌హ్యాండ్ అయిన జనరల్ జయేద్ మసూద్ పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర కథాగ మనంలో కీలకంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.