Loveyapa Trailer | ‘లవ్ టుడే’ బాలీవుడ్ రీమేక్‌లో శ్రీదేవి చిన్న కూతురు.. ట్రైలర్ చూశారా.!
Khushi Kapoor, Junaid Khan | దివంగత నటి శ్రీదేవి కుమార్తెలు ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీకపూర్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో సినిమాలు చేస్తుంది.
Khushi Kapoor, Junaid Khan | దివంగత నటి శ్రీదేవి కుమార్తెలు ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీకపూర్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో సినిమాలు చేస్తుంది. రీసెంట్గా దేవరతో హిట్ కూడా అందుకుంది. ఈ క్రమంలోనే శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా వరుస అవకాశలతో బిజీ అవుతుంది. ‘ది ఆర్చిస్’ (the archies)తో నటిగా తెరంగేట్రం చేసిన ఖుషి కపూర్ ‘లవ్యాపా’(Loveyapa) అంటూ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆమిర్‌ఖాన్ తనయుడు జువైద్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
తమిళంతో పాటు తెలుగులో సూపర్ హిట్ అందుకున్న లవ్ టుడే(Love Today) సినిమాకి ఈ చిత్రం రీమేక్‌గా వస్తుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైనమెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్‌తో పాటు ప్రోస్ట్ పాయ సృష్టి బెహల్, భావన తల్వార్, మధు మండేనా సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఖుషీ కపూర్, జునైద్ ఖాన్, గ్రుషా కపూర్, అశుతోష్ రాణా, తన్వికా పార్లికర్, కికు శారదా, దేవిషి మందన్, ఆదిత్య కులశ్రేష్ట్, నిఖిల్ మెహతా, జాసన్ థామ్, యూసుస్ ఖాన్, యుక్తం ఖోల్సా, కుంజ్ ఆనంద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

