నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై కె.నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 10న విడుదలకానుంది. ‘రేవంత్, మౌనిక అనే జంట కథ ఇది. భిన్న మనస్తత్వాలు కలిగిన వారి ప్రేమప్రయాణానికి చక్కటి దృశ్యరూపంగా ఈ సినిమా ఉంటుంది. ప్రేమకు కొత్త భాష్యంగా నిలుస్తుంది ఈ సినిమాలోని ‘సారంగదరియా’తో పాటు మిగిలిన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది.సున్నితమైన భావోద్వేగాలతో ఆహ్లాదభరిత ప్రేమకథగా దర్శకుడు శేఖర్‌కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’ అని తెలిపారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: పవన్ సిహెచ్, సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్.