అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘లవ్ జాతర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. శుక్రవారం టైటిల్ ప్రకటనతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘నేటి ట్రెండ్‌కు తగినట్లుగా సాగే యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది.
వారిలో ఉండే కన్ఫ్యూజన్, లవ్, ఎమోషన్స్‌ను వినోదప్రధానంగా ఆవిష్కరిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను త్వరలో వెల్లడిస్తాం’అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ్, సంగీతం: చేతన్ భరద్వాజ్, రచన-దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి.