హాలీవుడ్ నుంచి మరో సూపర్ హీరో సినిమా రాబోతుంది. డీసీ యూనివర్స్ నుంచి ‘ది ఫ్లాష్ అనే చిత్రం మన ముందుకు రానుండగా.. డీసీ, వార్నర్ బ్రదర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్లో హనుమంతుడు కనిపించాడు.
డీసీ, వార్నర్ బ్రదర్స్ సమర్పణలో ‘ది ఫ్లాష్ అనే సూపర్ హీరో సినిమా రాబోతుంది. డీసీ ఎక్స్టెండెడ్ యూనివర్స్ అనే సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రానికి అండీ ముషియెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేయగా.. ఈ ట్రైలర్ బిలియన్ల వ్యూస్‌తో యుట్యూబ్లో దూసుకుపొతుంది. అయితే భారతీయుల్లో చాలా మంది ఇష్టదైవంగా కొలిచే హనుమంతుడు ఈ సినిమా ట్రైలర్లో కనిపించాడు. నిశితంగా చూస్తే తప్ప గమనించడం కష్టం. ఈ ట్రైలర్ 2.16 నిమిషాల వద్ద హీరో వెనుక భాగంలో హనుమంతుడి పోస్టర్ కనిపిస్తుంది. హన్మాన్ ఏంటి ట్రైలర్లో ఏంటి అనుకుంటున్నారా.? ఇప్పుడు అదే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
అయితే ఈ ట్రైలర్లో హన్మాన్ కనిపించడంపై చిత్రబృందం స్పందించకపోయినా.. భారతీయులు మాత్రం ఈ విషయాన్ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. హనుమంతుని రిఫరెన్స్ ఈ మూవీలో ఖచ్చితంగా ఉంటుందని.. అందుకే ఆయన పోస్టర్ పెట్టారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందులో సూపర్ గర్ల్ పాత్ర పోషిస్తున్న సాషా కూడా ట్రైలర్లో చూడడానికి హన్మాన్ రూపంలా ఉందని.. తన కదలికలు కూడా హన్మాన్ లాగా ఉన్నాయని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.
ఎజ్రా మిల్లర్ సూపర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో.. ఒకప్పుడు హాలీవుడ్ బ్యాట్‌మ్యాన్‌గా వెలుగొందిన మైఖల్ కీటన్ మళ్లీ బ్యాట్‌మ్యాన్‌గా అలరించనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా డీసీ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా జూన్ 16న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది.