Dhanush carbon copy | అరె అచ్చు ధనుష్‌లా ఉన్నాడే..ఇంతకీ ఎవరితడు
తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు ధనుష్ (Dhanush). ఈ స్టార్ హీరో నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంటాడని తెలిసిందే.
డీగ్లామరైజ్డ్ రోల్స్, క్లాస్, మాస్ ఇలా పాత్ర ఏదైనా అవలీలగా ఒదిగిపోయే టాలెంట్ ఉన్న ఉన్న హీరో ధనుష్ (Dhanush). తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. ఈ స్టార్ హీరో నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంటాడని తెలిసిందే. ఈ సారి కూడా ఓ స్టిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ధనుష్. ఇంతకీ ఆ ఫొటో దిగింది ఎక్కడో తెలుసా..? ప్రముఖ పర్యాటక ప్రదేశం ఊటీలో (Ooty ). ఆ స్టిల్‌ను గమనిస్తే మరో వ్యక్తి కూడా కనిపిస్తాడు.
అదేంటి ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరిలో ఇంతకీ ధనుష్ ఎవరని తికమక పడుతున్నారా..? ఆ స్టిల్‌ను తీక్షణంగా గమనిస్తే ధనుష్ ఎవరో తెలుస్తోంది. మరి అందులో ఉన్న మరో వ్యక్తి ఎవరనే కదా మీ డౌటు. అతడు జూనియర్ ధనుష్. అదేనండి ధనుష్ కుమార్ యాత్ర (Yathra). ప్రస్తుతం నానే వరువెన్ (Naane Varuven) సినిమా చిత్రీకరణ నిమిత్తం ఊటీలో ఉన్నాడు ధనుష్. షూటింగ్ బ్రేక్‌లో యాత్రతో కలిసి క్వాలిటీ సమయాన్ని గడిపాడు ధనుష్. కొడుకు యాత్ర హెయిర్‌ను సెట్ చేస్తున్నట్టు స్టిల్‌లో చూడొచ్చు.
ధనుష్‌కు యాత్ర కార్బన్ కాపీలా ఉన్నాడంటూ నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. డ్యుయల్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా కోసం ధనుష్ విలువిద్య పాఠాలు నేర్చుకుంటున్నాడు. మొత్తానికి మూవీ లవర్స్ కోసం త్వరలోనే మరో ధనుష్ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసే అవకాశాలు లేకపోలేదంటున్నారు సినీ జనాలు.
Samantha Habibo dance | సమంత ‘హబిబో’ డ్యాన్స్ అదిరిందంతే..వీడియో వైరల్
Khiladi Hindi Collections | హిందీ మార్కెట్లో డీలా పడ్డ ‘ఖిలాడీ’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- dhanush
- Naane Varuven
- Ooty
- Yathra
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

