Khiladi Hindi Collections | హిందీ మార్కెట్లో డీలా పడ్డ ‘ఖిలాడీ’
రవితేజ (Ravi Teja) కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు..బిజినెస్ మార్కెట్‌ను కూడా పెంచేసింది క్రాక్. శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ ప్లాట్ ఫామ్స్ లో ఈ హీరో సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది.
క్రాక్ సినిమాతో మంచి ఫాంలోకి వచ్చాడు టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja). ఈ చిత్రం రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు..బిజినెస్ మార్కెట్‌ను కూడా పెంచేసింది. శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ ప్లాట్ ఫామ్స్ లో ఈ హీరో సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖిలాడీ (Khiladi) సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో బాక్సాపీస్ వద్ద బోల్తా పడిపోయింది.
ఈ హీరో క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పెన్ ఇండియా ఖిలాడీ హిందీ డబ్బింగ్ రైట్స్ (Hindi dubbing rights) ను రూ.20 కోట్లకు దక్కించుకున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. ఇటీవలే అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రానికి పెన్ ఇండియా మంచి కలెక్షన్లను అందుకుంది. అదే రూట్లో ఖిలాడీ కూడా మంచి వసూళ్లను రాబడతాడని ఆశలు పెట్టుకున్న పెన్ ఇండియాకు అడియాశలే మిగిలాయి. తాజా అప్ డేట్ ప్రకారం ఖిలాడీ హిందీ వెర్షన్ కు కలెక్షన్లు జీరోనట.
ముంబై, ఢిల్లీతోపాటు ఇతర ఉత్తరాది ప్రాంతాల్లో గత వారం ఖిలాడీ విడుదలైంది. కానీ స్పందన మాత్రం కరువవడంతో హిందీలో ప్లాప్ ను మూటగట్టుకుంది. యూట్యూబ్ ఛానల్ లో కూడా హిందీ వెర్షన్ మార్కెట్ చేయలేకపోయింది. రవితేజ ప్రస్తుతం శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు.
Liger OTT Craze | లైగర్ ఓటీటీ మార్కెట్ క్రేజ్ మామూలుగా లేదు..
Rashmika Mandanna | లింకప్ రూమర్లపై రష్మిక లేటెస్ట్ రియాక్షన్ ఇదే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

