Tamil director Lokesh Kanagaraj | తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన అప్‌కమింగ్ ‘కూలీ’ సినిమా ప్రమోషన్లలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో పెరుగుతున్న ద్వేషం (హేట్), అభిమానుల గొడవల కారణంగా తాను తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతున్నానని లోకేష్ వెల్లడించారు.
ఒక ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ.. నేను నా పర్సనల్ లైఫ్‌ని సోషల్ మీడియాలో ఉన్న నెగెటివిటీ, హేట్ కారణంగా ప్రైవేట్‌గా ఉంచుతున్నాను. ఒకసారి నేను నిద్రలో ఉండగా పొరపాటున ట్విట్టర్లో ఒక ఫ్యాన్ వార్ పోస్ట్‌ను లైక్ చేశాను. వెంటనే నాకు చాలా వైపుల నుండి కాల్స్ వచ్చాయి. దాంతో ఆ పోస్ట్‌ను వెంటనే అన్‌లైక్ చేయాల్సి వచ్చింది. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి, నా ట్విట్టర్ అకౌంట్‌ను నా మేనేజర్ మాత్రమే ఆపరేట్ చేస్తున్నారని.. ఇది జరిగిన తర్వాత నా పర్సనల్ లైఫ్‌ని సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేయవద్దని నిర్ణయించుకున్నట్లు లోకేష్ చెప్పుకోచ్చాడు. లోకేష్ చేసిన వ్యాఖ్యలు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడిని, అభిమానుల మధ్య జరిగే అనవసరమైన గొడవల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను స్పష్టం చేస్తున్నాయి.
“I’m keeping my Family life as private because of the hate in SM. For Eg in Twitter, I liked a Fan war post by mistake in sleep mode. I got many calls from different sides & I disliked it. From that point my manager is only accessing my twitter”
– #Lokeshpic.twitter.com/auPkk6JhuL— AmuthaBharathi (@CinemaWithAB) July 27, 2025