Thalaivar 171 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) రీసెంట్గా జైలర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. తలైవా 169వ సినిమాగా వచ్చిన జైలర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కింది. జైలర్ వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రజినీకాంత్ మరోవైపు ఇప్పటికే తలైవా 170 (Thalaivar 170) కూడా ప్రకటించాడు.
జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇప్పటికే లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj)దర్శకత్వంలో తలైవా 171 (Thalaivar 171)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రజినీకాంత్. ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న అభిమానులకు షాకింగ్ కలిగించే వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం విజయ్‌తో లియో సినిమా తెరకెక్కిస్తున్నాడని తెలిసిందే. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం లియో తర్వాత తలైవా 171 సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు లోకేశ్ కగనరాజ్. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి లోకేశ్ కనగరాజ్ తప్పుకోవాలని ఫిక్సయ్యాడట. ముందుగా ఈ సినిమా కోసం రజినీకాంత్‌కు స్నిపర్ సీన్ (గన్‌తో టార్గెట్‌ను చేధించే మిలటరీ వ్యక్తి సన్నివేశం) ను చెప్పాడట లోకేశ్ కనగరాజ్ . కానీ లోకేశ్‌కు ఊహలకు కూడా అందకుండా నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్‌లో ఇలాంటి సన్నివేశాలను పెట్టగా.. తలైవా పర్ఫార్మెన్స్ కొంత నిరాశకు గురిచేసిందట. అందుకే లోకేశ్ కగనరాజ్ ఈ సినిమా నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నాడంటూ వార్తలు ఊపందుకున్నాయి.
మరి దీనిపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్, నా రెడీ సాంగ్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్ మరోవైపు కూతురు ఐశ్వర్య డైరెక్షన్లో తలైవా ప్రధాన పాత్రలో నటిస్తోన్న లాల్‌సలామ్ (Lal Salaam) షూటింగ్ పూర్తయింది.
Loki planning to Quit from #Thalaivar171 ( An Un Announced Project ) which is Planned to Announce after #Leo ~
First Loki told about the Sniper scene in #LokeshKanagaraj to Rajini movie – #Thalaivar171 & Without Loki’s Knowledge – Rajinikanth told that Sniper scene to Nelson,… pic.twitter.com/kyRcYuoBWn
— Roвιɴ Roвerт (@PeaceBrwVJ) September 10, 2023
లాల్‌సలామ్ షూటింగ్ పూర్తి..
As the shoot 📽️ of #LalSalaam is completely wrapped, the team get together once again to rejoice it! 🤗✨ Off to the post-production now!#LalSalaam 🫡
🌟 @rajinikanth
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
💫 @TheVishnuVishal & @vikranth_offl
🎥 @DOP_VishnuR
⚒️ @RamuThangraj… pic.twitter.com/znDsyIfuzH— Lyca Productions (@LycaProductions) August 9, 2023