Keerthy Suresh | నాని జడ లాగిన కీర్తి సురేష్.. ‘వాడి జడల్ని ముట్టుకుంటే..’ అంటూ తెలంగాణ యాసలో పోస్ట్ వైరల్!
Keerthy Suresh | నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఆయన కెరీర్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ ఒకటి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, తాజాగా షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన ఓ సరదా బిహైండ్ ది సీన్స్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Keerthy Suresh | నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఆయన కెరీర్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ ఒకటి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, తాజాగా షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన ఓ సరదా బిహైండ్ ది సీన్స్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ ఫొటోను మరెవరో కాదు.. ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకోవడం విశేషం. సినిమాలో ఓ ప్రత్యేక పాటలో కనిపించనున్న కీర్తి, ఆ పాట షూటింగ్ సమయంలో నానితో కలిసి చేసిన సందడి ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.
తాజాగా కీర్తి సురేష్ షేర్ చేసిన ఫొటోలో నాని జడను సరదాగా పట్టుకుని కనిపించారు. ఈ ఫొటోకు ఆమె తెలంగాణ మాండలికంలో పెట్టిన క్యాప్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది. “వాడి జడల్ని ముట్టుకుంటే.. వాడికి సర్రుమంటది” అంటూ కీర్తి చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. మరో ఫొటోలో నాని, కీర్తి సురేష్ షూటింగ్ గ్యాప్‌లో సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని ఈ ఫొటోలు మరోసారి చాటిచెప్పాయి. అభిమానులు కూడా ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. నాని, కీర్తి సురేష్ కాంబినేషన్‌కు టాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ‘దసరా’ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. ఆ చిత్రంలో ధరణి, వెన్నెల పాత్రల్లో వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇప్పుడు అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ కోసం ఈ హిట్ కాంబినేషన్ మరోసారి కలిసి రావడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే ఈసారి కీర్తి సురేష్ హీరోయిన్గా కాకుండా ఓ ప్రత్యేక పాటలో కనిపించనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లో నాని, కీర్తి సురేష్‌పై ఈ ప్రత్యేక పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్‌లో వీరిద్దరితో పాటు దాదాపు 1000 మంది డ్యాన్సర్లు, ఆర్టిస్టులు పాల్గొంటున్నారని సమాచారం. దీంతో ఈ పాట సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భారీ పాటకు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్ కొరియోగ్రఫీ అందిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మాస్ బీట్తో కూడిన ఎనర్జిటిక్ ట్యూన్‌ను అందించినట్లు తెలుస్తోంది. గతంలో ‘దసరా’లోని పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నేపథ్యంలో, ఈసారి కూడా నాని-కీర్తి-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న స్పెషల్ సాంగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ది ప్యారడైజ్’ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదల కానున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

