Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Zimbabwe Cricket : జింబాబ్వే మహిళల జట్టు చరిత్రాత్మక సిరీస్‌కు సిద్ధమైంది. తాజాగా వెస్టిండీస్‌పై విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆ జట్టు మొట్టమొదటి ద్వైపాక్షిక సిరీస్ (Bilateral Series) కోసం భారత్‌కు రానుంది.
Zimbabwe Cricket : జింబాబ్వే మహిళల జట్టు చరిత్రాత్మక సిరీస్‌కు సిద్ధమైంది. తాజాగా వెస్టిండీస్‌పై విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆ జట్టు మొట్టమొదటి ద్వైపాక్షిక సిరీస్ (Bilateral Series) కోసం భారత్‌కు రానుంది. అక్టోబర్ రెండో వారంలో టీమిండియాతో వైట్‌బాల్ సిరీస్‌కు సమయం దగ్గరపడడంతో శనివారం సెలెక్టర్లు పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రకటించారు. జోసిఫెనె కొమా కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. తొలుత టీ20లు, ఆపై వన్డే సిరీస్‌లో టీమిండియాను ఆఫ్రికా జట్టు ఢీ కొట్టనుంది.
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ పోటీలకు సంయుక్త ఆతిథ్య దేశంగా ఉన్న జింబాబ్వే క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలవ్వనుంది. ఈమధ్యే బలమైన వెస్టిండీస్‌ను స్వదేశంలో మట్టికరిపించిన ఆ దేశ మహిళల జట్టు.. రెట్టించిన ఉత్సాహంతో తొలిసారిగా భారత పర్యటనకు రానుంది. టీమిండియాతో తొట్టతొలి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడం విశేషం. ఉమెన్ ఇన్ బ్లూతో వైట్ బాల్ సిరీస్ కోసం రాబోతున్న జింబాబ్వే బృందాన్ని సెలెక్టర్లు ప్రకటించారు. జోసెఫినె కొమో కెప్టెన్‌గా 15 మందితో కూడిన స్క్వాడ్‌ను వెల్లడించారు.
ZC retains history-making Zimbabwe Women squad for India tour
Details 🔽
https://t.co/mhlU39mkKt https://t.co/IA7ZlfuhaR
— Zimbabwe Cricket (@ZimCricketv) October 9, 2026
అక్టోబర్ 16వ తేదీ నుంచి భారత్, జింబాబ్వే మహిళా జట్ల మధ్య వైట్ బాల్(టీ20, వన్డే) సిరీస్ మొదలవ్వనుంది. అక్టోబర్ 16న తొలి టీ20, అక్టోబర్ 18న రెండోది, అక్టోబర్ 20న మూడో మ్యాచ్‌తో పొట్టి సిరీస్ ముగియనుంది. ఆపై.. అక్టోబర్ 23 నుంచి 28వ తేదీ వరకూ వన్డే సిరీస్‌లో భారత్, జింబాబ్బే తలపడనున్నాయి. ఇటీవలే హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టిన స్మృతి మంధానకు ఈ సిరీస్‌తోనే స్వదేశంలో తొలి సవాల్ ఎదురవ్వనుంది.
జింబాబ్వే మహిళా స్క్వాడ్: జోసెఫినె కొమో(కెప్టెన్), బిలవ్డ్ బిజా, చిపో ముగేరి-తిరిపనో, కెలిస్ ధలోవు, మిచెల్లే మవుంగా, ఫ్రాన్సిస్కా చిపరే, ఒలిండర్ చారే, కడ్జాయి చిగోర, యశా గ్వాంజుర, నొమవెలొ సిబండా, లొరిన్ ఫిరీ, చియెడ్జ ధురురు, మొడెస్టర్ ముపచిక్వా, తెండాయ్ మకుషా, ష్రానే మేయర్స్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

