Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Ranabaali | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన తాజా చిత్రానికి సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Vijay Devarakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన తాజా చిత్రానికి సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న తన కొత్త సినిమా ‘రణబాలి’ విడుదల వేళ, టికెట్ల ధరల పెంపు గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో విజయ్ స్వయంగా రంగంలోకి దిగి ఈ అంశంపై మాట్లాడుతూ.. ఇకపై తాను నటించే ఏ చిత్రానికి కూడా అదనపు టికెట్ రేట్లు లేదా ప్రత్యేక హైక్స్ ఉండే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. రణబాలి చిత్రానికి సంబంధించి కూడా ఎలాంటి రేట్ల పెంపు కోరుకోవడం లేదని మేకర్స్ స్పష్టం చేసిన తరుణంలో, విజయ్ చేసిన ఈ ప్రకటన సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నిర్ణయంలో ఓ చిన్న మెలిక కూడా ఉంది. ఒకవేళ భవిష్యత్తులో దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే మాత్రం ఆ ఒక్క సినిమాకు మినహాయింపు ఉంటుందని, మిగతా అన్ని సినిమాలకూ సాధారణ ధరలే వర్తిస్తాయని ఆయన కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయంపై విజయ్ నుంచి కానీ అతడి టీమ్ నుంచి కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు టికెట్ ధరల పెంపు విషయంలో విజయ్ దేవరకొండ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ భారీ అంచనాల చిత్రం ‘రణబాలి’ అక్టోబర్ 16న అత్యంత ఘనంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

