Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Smit Machchhar : భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై జరిగిన దాడిపై విచారణ చేయాల్సిందిగా ఎన్ఐఏ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
Smit Machchhar : ఇటీవల ఫ్లైదుబాయ్ విమాన ఘటన గురించి తెలిసిందే. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానాన్ని ఒమన్‌కు చెందిన కో పైలట్ కూల్చేందుకు ప్రయత్నించగా.. భారతీయ పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్చర్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పుడు కేంద్రం మరోసారి స్పందించింది. భారతీయ కెప్టెన్‌పై జరిగిన దాడిపై విచారణ చేయాల్సిందిగా ఎన్ఐఏ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
గత సెప్టెంబర్ 30న ఫ్లై దుబాయ్ సంస్తకు చెందిన విమానం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ (టెల్ అవీవ్) వెళ్తుండగా.. ఒమనీ కో పైలట్ ఆ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు. దీన్ని భారతీయుడైన పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్చర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. స్మిత్ మచ్చర్ సాహసం వల్ల విమానంలోని 174 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న అదనపు పైలట్లు విమానాన్ని సౌదీకి దారి మళ్లించి, అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ప్రస్తుతం ఈ అంశంపై అటు ఇజ్రాయెల్, దుబాయ్, సౌదీ ప్రభుత్వాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు ఇండియా కూడా ఎన్ఐఏ ద్వారా విచారణకు ఆదేశించింది. యాంటీ హైజాకింగ్ యాక్ట్, 2016లోని సెక్షన్ 3తోపాటు మరికొన్ని సెక్షన్ల కింద దర్యాప్తు చేయనుంది ఎన్ఐఏ. ఈ ఘటన వెనుక ఉన్న కుట్ర, విమానంలో జరిగిన పరిణామాలు, ఇతర అంశాల్ని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. అనంతరం కేంద్రానికి నివేదిక అందిస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ.. విచారణ ప్రారంభించనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- flydubai
- NIA
- Omani
- Smit Machchhar
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

