ఖైదీ, విక్రమ్, మాస్టర్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఈ టాలెంటెడ్ దర్శకుడు విజయ్ (Vijay)తో తెరకెక్కించిన మాస్టర్ తమిళంలో మంచి సక్సెస్ అందుకుంది. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ మరోసారి సందడి చేయబోతుందని ఇప్పటికే నెట్టింట అప్డేట్స్ రౌండప్ చేస్తూనే ఉన్నాయి.
దళపతి 67 (Thalapathy 67)గా రాబోతున్న ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ అందించాడు లోకేశ్. ఫిబ్రవరి మొదటి వారంలో దళపతి 67 సినిమాకు సంబంధించిన ప్రకటన ఉండబోతుందని తెలియజేశాడు. కోయంబత్తూరులో జరిగిన మైఖేల్ ప్రమోషనల్ ఈవెంట్లో ఈ విషయాన్ని ప్రకటించాడు లోకేశ్. ప్రస్తుతం వారిసు సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్. ఈ స్టార్ హీరో త్వరలోనే లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్‌తో బిజీగా కాబోతున్నాడని తాజా న్యూస్‌తో అర్థమవుతుంది.
లోకేశ్ స్పీచ్ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. గతేడాది మల్టీస్టారర్ ప్రాజెక్ట్ విక్రమ్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాడు లోకేశ్ కనగరాజ్. మరి విజయ్‌తో చేయబోతున్న రెండో సినిమా ఎలాంటి జోనర్లో ఉండబోతుంది.. ఈ సారి ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తుందోనంటూ అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టారు అభిమానులు.
Mark the dates Feb 1st 2nd and 3rd 🔥#Thalapathy67
pic.twitter.com/GUYMiidwa2— Vijay Fans Trends (@VijayFansTrends) January 25, 2023