Kotha Lokah Movie | చిన్న సినిమాగా విడుదలై మలయాళంలో బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘లోక ఛాప్టర్ 1చంద్ర’ (తెలుగులో కొత్త లోక). ఆగష్టు 28న విడుదలైన ఈ చిత్రం మలయాళంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మలయాళంలో ఆల్టైమ్ హిట్గా రికార్డు నెలకోల్పిన ఈ చిత్రం తాజాగా మరో రికార్డును అందుకుంది. ఈ చిత్రం మలయాళంలో ఇండస్ట్రీలో మొట్టమొదటి సారిగా రూ.300 కోట్లు దాటిన సినిమాగా చరిత్ర సృష్టించింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 40 రోజుల్లోనే రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం. మరోవైపు కేవలం మలయాళంలోనే 50000 షోలు ప్రదర్శించిన తొలి సినిమాగా ‘లోక’ రికార్డు సృష్టించింది.
ఈ సినిమా ఓటీటీ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో రాబోతుందని ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఈ సినిమా జియో హాట్స్టార్లో త్వరలోనే రాబోతుందని టాక్ నడుస్తుంది. ఇక దీనిపై నిర్మాత దుల్కర్ సల్మాన్ స్పందించాల్సి ఉంది.