Vijay Devarakonda | చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్ర కథానాయకులు అల్లు అర్జున్, నాని, అక్కినేని నాగ చైతన్య, సుమంత్ వంటి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కూడా ‘లిటిల్ హార్ట్స్’ చిత్ర బృందాన్ని కలుసుకున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ.. దర్శకుడు సాయి మార్తాండ్తో పాటు హీరో మౌళి తనుజ్, హీరోయిన్ శివానీలను అభినందించినట్లు తెలుస్తోంది. అనంతరం విజయ్ తన క్లాతింగ్ బ్రాండ్ అయిన రౌడీ బట్టలను హీరో మౌళికి గిప్ట్గా ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
యూట్యూబర్ మౌళి తనుజ్, శివానీ నాగారం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయి మార్తండ్ దర్శకత్వం వహించగా.. ఆదిత్య హాసన్ నిర్మించారు. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, సత్య కృష్ణన్ వంటి నటులు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.
Our Man @TheDeverakonda congratulated team #LittleHearts 😍😍🤍#VijayDeverakonda #moulitalks pic.twitter.com/RQp9muobAG
— Pavan Kumar (@pavankumar__123) September 12, 2025
Mouli x Rwdy 🔥🤍#VijayDeverakonda #Mouli #LittleHearts pic.twitter.com/90Jd7XtbwC
— Pavan Kumar (@pavankumar__123) September 13, 2025