‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ఫేం మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగారం లీడ్‌రోల్స్ పోషిస్తున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకుడు. ఆదిత్య హాసన్ నిర్మాత. వచ్చే నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ కథను అందరూ నమ్మారనీ, ఓ విధంగా ఈ కథే తనను దర్శకుడ్ని చేసిందని, వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు సాయి మార్తాండ్ అన్నారు. కంటెంటే ఈ సినిమాకు ప్రధాన బలమని హీరో మౌళి తనుజ్ పేర్కొన్నారు. ‘మా ‘90s మిడిల్‌క్లాస్ బయోపిక్’కి పనిచేసిన వాళ్లే ఈ సినిమాకూ పనిచేశారు.
నిర్మాతగా నాకు ఈ సినిమా పూర్తి సంతృప్తినిచ్చింది. రెండుగంటల పాటు హాయిగా నవ్వించే సినిమా ఇది.’ అని నిర్మాత ఆదిత్య హాసన్ తెలిపారు. ఇంకా ఈటీవీ బిజినెస్ హెడ్ సాయికృష్ణ, వంశీ నందిపాటి, బన్నీ వాస్ కూడా మాట్లాడారు. రాజీవ్ కనకాల, ఎస్.ఎస్.కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య బాలాజీ, సంగీతం: సింజిత్ యెర్రమల్లి, నిర్మాణం: ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్.