త్రిగుణ్ కథానాయకుడిగా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘లైన్ మెన్’. వి.రఘుశాస్త్రి దర్శకుడు. పర్పల్ రాక్ ఎంటర్టైనర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. యువహీరో శివ కందుకూరి అతిథిగా ఇచ్చేసి బిగ్ టికెట్‌ని లాంచ్ చేశారు.
ఈ సందర్బంగా చిత్ర యూనిట్సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు అందించారు. ‘టీవీలకు, ఫోన్లకు బానిసలుగా మారిపోయాం. ఒక గంట కరెంట్ పోతే బతకలేని పరిస్థితి. అలాంటిది ఓ పదిరోజులు కరెంట్ లేకపోతే ఎలా వుంటుంది? అదే ఈ సినిమా కథ. అన్నీ ఉన్నప్పుడు వాటి విలువ తెలీదు. లేనప్పుడే దేని విలువైనా తెలిసేది.
ఈ సందేశమే ఈ సినిమా ద్వారా చెబుతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కనెక్ట్ అవుతారు’ అన్నారు హీరో త్రిగుణ్. ఇంకా చిత్ర యూనిట్‌తో పాటు డైరెక్టర్ నందినీరెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు కూడా మాట్లాడారు. కాజల్ కుందెర్, బి.జయశ్రీ, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: శాంతి సాగర్ హెచ్.జి, సంగీతం: కద్రి మణికాంత్.