Liger Special Video | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుండి సినిమా వచ్చి రెండేళ్ళు దాటింది. ఈయన నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటించిన ‘లైగర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ క్రమంలో లైగర్ టీం అప్డేట్లను స్టార్ట్ చేసింది. తాజాగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.
‘లైగర్’ చిత్రంలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఈయన పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ లైగర్ టీమ్ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మైక్ టైసన్ సెట్లో పూరి, విజయ్ మధ్య జరిగిన సన్నివేశాలను చూపించారు. ముంబైలోని ఓ ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు తోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.