శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 02, 2020 , 12:35:40

ఈత‌కు వెళ్దామంటోన్న శ్ర‌ద్దాదాస్..ఫొటో వైర‌ల్

ఈత‌కు వెళ్దామంటోన్న శ్ర‌ద్దాదాస్..ఫొటో వైర‌ల్

అందం ఉన్న‌ది చూపించ‌డానికే..ఇదీ టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్ర‌ద్దాదాస్ ఫిలాస‌ఫీ. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన లేటెస్ట్ స్టిల్ చూస్తే ఈ విష‌యం తెలిసిపోతుంది. శ్ర‌ద్దాదాస్ బికినీ వేర్ లో హాట్ లుక్ లో  ఫొటోషూట్ లో పాల్గొన్న‌ది. లాక్ డౌన్ స‌మ‌యంలో యాడ్ షూట్ లో అందాలు ఆర‌బోసిన ఈ సుంద‌రి ఇపుడు మ‌రో ఫొటోతో అంద‌రి మ‌తులు పోగొడుతోంది. ఈత‌కు వెళ్దాం అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. గ్లామ‌ర‌స్ లుక్ లో శ్ర‌ద్దాదాస్ పోస్ట్ చేసిన ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా న‌టించిన ఆర్య‌2లో కీ రోల్ చేసి అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

కార్తికేయ‌తో క‌లిసి హిప్పీలో క‌నిపించిన ఈ భామ స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. తెలుగులో శ్ర‌ద్దాదాస్ నిరీక్ష‌ణ‌, అర్థం చిత్రాల్లో న‌టిస్తోంది. క‌న్న‌డలో ఓ చిత్రం చేస్తోంది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.