Leo | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న లియో నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియోతోపాటు నా రెడీ సాంగ్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాను యూకేలో అదిరిపోయే రేంజ్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా.. ఈ మూవీ టికెట్ బుకింగ్స్‌ను నెల రోజుల ముందుగానే సెప్టెంబర్ 7 నుంచి ఓపెన్ చేయబోతున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు.
#LEO bookings will open at all locations gradually from Sept 7. If you don’t see your nearest @cineworld cinema, just wait a bit — they’ll join in. More and MORE shows will be added leading up to Oct 19. Brought to you by #AhimsaEntertainment ❤️
When cinemas decide to open…
— Ahimsa Entertainment (@ahimsafilms) August 26, 2023
ఇక లియో చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ కూడా ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది.
యాక్షన్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ ఈ మూవీకి డైలాగ్స్ అందిస్తున్నారు. మాస్టర్ తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి.