Leo Movie | వారసుడు సినిమా తర్వాత తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన తాజా చిత్రం ‘లియో’ (LEO). లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఈనెల 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకెళుతూ.. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన కేవలం 12 రోజుల్లోనే రూ.600 కోట్లు వసూలు చేసింది. ఈ సందర్భంగా లియో మేకర్స్ బుధవారం చెన్నైలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో లియో టీమ్ ఈ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇక ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్లుగా దళపతి విజయ్‌తో పాటు, త్రిష, లోకేష్ కనగరాజ్ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కాంట్రవర్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమిళంలో అసలు సూపర్ స్టార్ ఎవరంటూ ఈ మధ్య ఫ్యాన్స్‌లో చర్చ జరుగుతుండగా.. ఈ విషయంపై విజయ్ స్పందించాడు. తమిళంలో ఒక్కరే తలైవర్ అతడే ఎంజీ రామచంద్రన్, ఒక్కరే నడిగర్ తిలగం (శివాజీ గణేశన్), ఒక్కరే కలైంగర్ (కెప్టెన్ విజయ్‌కాంత్), ఒక్కరే సూపర్ స్టార్ (రజనీకాంత్). ఒక్కరే ఉలగనాయగన్ (కమల్ హాసన్), ఒక్కరే తాలా (అజిత్). దళపతి కూడా ఒక్కడే అతనే విజయ్. దళపతి అంటే అర్థం రాజు ఆదేశాన్ని పాటించేవాడు అని. నా అభిమానులే నా రాజులు. నేను మీ సేవకుడిని’ అని విజయ్ తెలిపారు. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
That Senior Actor Should Learn from this Man @actorvijay 💥#LeoSuccessMeet #Leo #ThalapathyViiay #Rathna #ThalapathySpeech #Thalapathypic.twitter.com/B6qvpjATkn
— 𝐕𝐣 ♠️ ム丂んWノ刀 (@vijayanna_tn) November 1, 2023
ఇక ఈ కార్యక్రమంలో మిష్కిన్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీఖాన్, మడోన్నా, మాథ్యూ థామస్, మరియమ్ జార్జ్ ‘బిగ్ బాస్’ జనని, సినిమాటోగ్రాఫర్ ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ డైరెక్టర్ సతీష్ కుమార్, నటుడు విజయ్ తల్లి శోభ పాల్గొన్నారు. .